Jagityal : గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జోరుతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయి. సారంగాపూర్ మండలం మేడారం తండా (Medaram Thanda) గ్రామ సర్పంచ్ భూక్య సరిత చిరంజీవి (Bhukya Saritha Chiranjeevi) గులాబీ పార్టీలో చేరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సమక్షంలో BRS పార్టీలో చేరారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసిఆర్‌దేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలన్నీ కూడా కేసీఆర్ వైపే చూస్తున్నాయనీ, మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలు రాజు, బీఆర్ఎస్ నాయకులు ఒడ్నాల జగన్, భాస్కర్ నాయక్, సుమన్ నాయక్, రాజమల్లు, రమేష్, వార్డ్ సభ్యులు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.