Landslide : హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు (Landslide) విరిగిన పడిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రమాదం జరిగిన కాసేపటికే 15 మంది మరణించినట్టుగా గుర్తించారు. అయితే.. ఇప్పటివరకూ 18 మంది మరణించారని బిలాస్పూర్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్తె (Rahul Kumar)లిపారు.
ఈ ఘటన గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆదుకుంటామని చెప్పిన ప్రధాని ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రకృతి విపత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయక నిధి ద్వారా రూ.2 లక్షలు చెల్లిస్తామని మోడీ పేర్కొన్నారు. గాయపడినవాళ్లకు రూ.50 వేలు నష్టపరిహారంగా ఇస్తామని ఆయన వెల్లడించారు.
#BreakingNews | Bus buried under debris after landslide in Himachal Pradesh’s Bilaspur
Several passengers are feared trapped. Rescue operation underway.#HimachalPradesh #Bilaspur #BilaspurAccident pic.twitter.com/Xm5CMSIFfy
— DD News (@DDNewslive) October 7, 2025
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో పర్యాటకుల బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో బస్సులో డ్రైవర్ సహ 30 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ఎత్తు నుంచి బురద, మట్టి పెల్లలు, రాళ్లు మీద పడడంతో బస్సులోని 15 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో రాళ్లు, మట్టి, బురద కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జేసీబీల సాయంతో రాళ్లను తొలగిస్తున్నారు.
Bus buried under debris after #landslide in #Himachal‘s Bilaspur, several trapped
The incident occurred near Ballu Bridge when a large amount of mud and rocks slid down from a hillside and crashed onto a private bus. The impact buried the vehicle under the debris.
Read More:… pic.twitter.com/8QLjzaoIVZ
— IndiaToday (@IndiaToday) October 7, 2025