న్యూఢిల్లీ: అనేక మంది గృహ కొనుగోలుదారులను మోసగించి, మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఢిల్లీ ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యూపీ, హర్యానాల్లోని రూ.580 కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని ఈడీ శనివారం అటాచ్ చేసింది. అడెల్ ల్యాండ్ మార్క్స్ లిమిటెడ్ (గతంలో ఎరా ల్యాండ్ మార్క్స్ లిమిటెడ్), వాటి ప్రమోటైర్లెన హేమ్ సింగ్ భరణ, సుమిత్ భరణలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఈడీ తెలిపింది. పీఎంఎల్ఏ చట్టం కింద సంస్థకు చెందిన హర్యానా, ఘజియాబాద్, యూపీల్లో గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వల్, బహదూర్గర్ ల్లోని 340 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికా రులు తెలిపారు.
ఈ మొత్తం ప్లాట్ల విలువ 585.46 కోట్ల రూపాయలని వివరించారు. ఈ సంస్థ ప్లాట్లు ఇస్తామని చెపి వందలాది మంది గృహ కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి గత 12-19 సంవ త్సరాలుగా వారికి ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అలాగే ఈ కంపెనీ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టుల పేరిట గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వల్లలో 4,771 మంది వినియోగదారుల నుంచి రూ.1,075 కోట్లను అడ్వాన్స్ బుకింగ్‌గా తీసుకుని 2006-12 మధ్య పలు ప్రాజెక్టులను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిందని ఈడీ తెలిపింది.