Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ (Comedian) కునాల్ కమ్రా (Kunal Kamra) చేసిన స్కిట్ తీవ్ర వివాదాస్పదమైంది. కామెడీ షోలో షిండేను దేశ ద్రోహిగా పేర్కొంటూ ఓ పాట కూడా పాడారు. దీంతో మహా రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కమ్రాపై శివసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖార్ (Khar) ప్రాంతంలోని హాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా షో జరిగింది. షోలో భాగంగా కమ్రా మహా రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ దేశ ద్రేహి అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘కునాల్ కా కమల్’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఈ అంశం కాస్తా వివాదాస్పదమైంది. కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు కొందరు శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు హాబిటాట్ స్టూడియో ప్రకటించింది.
Also Read..
Diabetes | డయాబెటిస్ రోగులకు క్యాన్సర్ ముప్పు అధికం!
Grok AI | దేశ రాజకీయాల్లో ‘గ్రోక్’ ప్రకంపనలు.. బీజేపీని ఇరుకున పెడుతున్న చాట్‌బాట్
Palatial House | సిమెంట్ వాడని రాతి ఇల్లు.. వెయ్యేండ్ల పాటు చెక్కు చెదరదట!