ముంబై: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కుంభమేళాపై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై సెటైర్లు వేశారు. మంగళవారం ఉగాది సందర్భంగా ట్విటర్లో శుభాకాంక్షలు చెబుతూనే వరుస ట్వీట్లు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన కుంభమేళాపై చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది కుంభమేళా కాదు కరోనా ఆటం బాంబు అంటూ మొదలు పెట్టిన వర్మ.. ఇన్ని లక్షల మందిలో కేవలం 26 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందంటే మనందరం పార్టీ చేసుకోవాలంటూ ముగించారు.
కుంభమేళాను కరోనా ఆటంబాంబుతో పోల్చిన వర్మ.. ఈ వైరల్ పేలుడుకు ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. కుంభమేళా.. గుబ్ బై ఇండియా, వెల్కమ కరోనా అని మరో ట్వీట్ చేశారు. కుంభమేళా నుంచి వచ్చిన వాళ్లకు మాస్కులే అవసరం లేదని, వాళ్లు ఇప్పటికే గంగలో తమ వైరస్‌ను విడిచి వచ్చేశారంటూ ఇంకో ట్వీట్లో వర్మ అన్నారు.
అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపైనా వర్మ సెటైర్లు వేశారు. దీనిని నేను లాక్డౌన్ అనను అన్న థాక్రే వ్యాఖ్యలపై ట్వీట్ చేస్తూ.. దానికి ఇంకో పేరు పెడుతున్నాను, అందరూ బారసాల కార్యక్రమానికి రావాలి, గిఫ్ట్‌లు తీసుకురావడం మరచిపోవద్దు అని ట్వీట్ చేశారు.
What you are seeing is not KUMBH MELA but it’s a CORONA ATOM BOMB ..I wonder who will be made accountable for this VIRAL EXPLOSION pic.twitter.com/bQP9fVOw5c
— Ram Gopal Varma (@RGVzoomin) April 13, 2021
Lakhs are dipping in kumbh mela to wash off their karma and as a blessing are getting the covid and then they are further gifting it to many more and when they die all will get double karma.😍😍😍😍
— Ram Gopal Varma (@RGVzoomin) April 14, 2021
If in a 31 lakh congregation like this as per govt only 26 tested positive then there’s no problem at all 💃💃 💃💃💃💃💃💃 Let’s all party 💐💐💐 https://t.co/Py8t66rnx5 pic.twitter.com/WZvt7pNqQQ
— Ram Gopal Varma (@RGVzoomin) April 13, 2021
ఇవి కూడా చదవండి
IPL 2021: సూర్యకుమార్ హిందీ టెస్ట్‌లో బౌల్ట్ పాస్.. వీడియో
కరోనా ఆంక్షలు.. రైల్వే స్టేషన్ ముందు భారీ క్యూలైన్లు
శంకర్‌తో రణ్వీర్.. అపరిచితుడు హిందీ రీమేక్
స్విగ్గీని నిషేధించాలంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్‌తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
కుంభమేళాను మర్కజ్‌తో పోల్చవద్దు..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం