బ్లాక్‌బస్టర్ మూవీ అపరిచితుడు హిందీలో రీమేక్ కాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ శంకరే హిందీలోనూ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని రణ్‌వీరే ఇన్‌స్టాలో ప్రకటించాడు. శంకర్‌తోపాటు ప్రొడ్యూసర్ జయంతిలాల్‌తో కలిసి ఉన్న ఫొటోను రణ్వీర్ ఈ సందర్భంగా షేర్ చేశాడు. ఇండియన్ సినిమా మార్గదర్శకుడితో చేతులు కలుపుతున్నానని ప్రకటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందంటూ అతడు కామెంట్ చేశాడు.
అద్భుతమైన సినిమాటిక్ విజన్ ఉన్న శంకర్ సర్‌తో మూవీ చేస్తుండటం తన అదృష్టమని ఈ సందర్భంగా రణ్వీర్ అన్నాడు. ఎప్పటికైనా ఆయనతో మూవీ చేయాలని తాను భావించేవాడినని, అపరిచితుడులాంటి మూవీలో లీడ్ రోల్ అంటే తన కల నిజమైనట్లే అని అతడు అనడం విశేషం. అన్నియన్ పేరుతో తమిళ్లో వచ్చిన ఈ మూవీ అపరిచితుడుగా తెలుగు డబ్ అయింది. ఈ మూవీలో స్ల్పిట్ పర్సనాలిటీతో మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విక్రమ్ చేసిన యాక్టింగ్ అద్భుతమనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి
స్విగ్గీని నిషేధించాలంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్‌తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
కుంభమేళాను మర్కజ్‌తో పోల్చవద్దు..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం
రాష్ట్రంలో కొత్తగా 2157 కరోనా కేసులు
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళి