PM Modi | అందరి సహకారంతో మహా కుంభమేళా విజయవంతమైందని (Maha Kumbh success) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ప్రపంచం మొత్తం భారత దేశ శక్తిని చూసిందని కొనియాడారు. పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా కుంభమేళాను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం అందరి కృషి ఫలితం అని మోదీ అన్నారు.
‘మహాకుంభమేళా విజయం అందరూ కలిసికట్టుగా చేసిన కృషి ఫలితం. భారత్ గొప్పతనాన్ని మహాకుంభ్ రూపంలో ప్రపంచం మొత్తం చూసింది. మహా కుంభ్‌లో జాతీయ మేల్కొలుపును మనం చూశాం. ఇది కొత్త విజయాలకు ప్రేరణనిస్తుంది. మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసింది. కుంభమేళాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఆవిష్కృతమయ్యాయి. ఇది దేశ ప్రజల విజయం. కుంభమేళా ప్రజల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచింది. ఈ చారిత్రాత్మక ఘట్టం భవిష్యత్తు తరాలకు ఉదాహరణగా నిలుస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజులపాటూ సాగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని మోదీ తెలిపారు. రాజకీయ, సినీ, వ్యాపార, విదేశీ ప్రముఖులు ఈ కుంభమేళాకు హాజరైనట్లు చెప్పారు. కుంభమేళా నీళ్లను తాను మారిషన్‌కి కూడా తీసుకెళ్లినట్లు ప్రధాని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున, సర్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో 66 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించారు.
#WATCH | Delhi | Prime Minister Narendra Modi says, “I stand here to speak on Prayagraj’s Maha Kumbh. I congratulate crores of countrymen because of whom the Maha Kumbh could be organised successfully. Many people contributed to the success of the Maha Kumbh… I thank the people… pic.twitter.com/YJIuMyZpJw
— ANI (@ANI) March 18, 2025
Also Read..
Sidhu Moosewala | సిద్ధూ మూసేవాలా సోదరుడి ఫస్ట్ బర్త్‌డే వేడుకలు.. వీడియో షేర్ చేసిన మాజీ సీఎం
PM Modi | ట్రూత్ షోషల్లో చేరిన ప్రధాని మోదీ.. ట్రంప్‌తో ఉన్న పవర్ఫుల్ ఫొటోతో తొలి పోస్టు