Garlic butter naan : సంప్రదాయ వంటకాల (Traditional foods) గురించి తెలియజేసే ప్రముఖ ట్రావెల్ ఆన్లైన్ గైడ్ (Travel Online Guide) టేస్ట్ అట్లాస్ (Taste Atlas).. ప్రపంచంలోని 50 అత్యుత్తమ బ్రెడ్స్‌తో ఒక జాబితాను విడుదల చేసింది. ఇందులో మన దేశానికి చెందిన గార్లిక్ బటర్ నాన్ (Garlic Butter Naan) కు అగ్రస్థానం దక్కింది. గార్లిక్ బటర్ నాన్కు టేస్ట్అట్లాస్ 4.7 రేటింగ్ పాయింట్లు ఇచ్చింది. గార్లిక్ బటర్ నాన్ అనేది సంప్రదాయబద్ధమైన ఫ్లాట్ బ్రెడ్ అని, నాన్లలో బాగా ప్రాచుర్యం పొందిన బ్రెడ్ అని టేస్ట్ అట్లాస్ అభివర్ణించింది.
గార్లిక్ బటర్ నాన్ను గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, చక్కెర, పెరుగుతో చేస్తారు. తందూర్ ఓవెన్లో వేడిచేసిన తర్వాత దానికి బట్టర్ లేదా నెయ్యి పూస్తారు. అనంతరం వెల్లుల్లితో ఫినిషింగ్ టచ్ ఇస్తారు. ఈ గార్లిక్ బటర్ నాన్ను దేశీయ వంటకాలైన కూరలు, బట్టర్ చికెన్, దాల్ మఖానీ, మలై కోఫ్తా, షాహీ పనీర్‌తో కలిపి తీసుకుంటారు. బటర్ నాన్‌తో పాటు మరికొన్ని దేశీయ వంటకాలకు కూడా 50 ప్రపంచ బెస్ట్ బ్రెడ్స్ జాబితాలో చోటుదక్కింది.
అమృత్సరి కుల్చాకు ఈ జాబితాలో రెండో స్థానం దక్కింది. అదేవిధంగా సౌత్ ఇండియన్ బ్రెడ్ పరోటా ఆరో స్థానంలో నిలిచింది. ఇక నాన్కు 8వ స్థానం, పరోటాకు 18వ స్థానం దక్కాయి. అదేవిధంగా బటూరాకు జాబితాలో 26వ స్థానం ఇచ్చారు. ఆలూ నాన్కు 28వ దక్కగా, ఇండియన్ రోటీకి 35వ స్థానం దక్కింది. టేస్ట్ అట్లాస్ వరల్డ్ 50 బెస్ట్ బ్రెడ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న అన్ని వంటకాల వివరాల కోసం కింది జాబితాను చూడవచ్చు.
World Best 50 Breads