ఇండియన్ వెల్స్ (యూఎస్ఏ): ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీ అయిన ఇండియన్ వెల్స్‌లో భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు యూకీ బాంబ్రీ, స్వీడన్ సహచరుడు ఆండ్రె గొరన్సన్ జోడీ సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో ఈ ఇండో, స్వీడన్ జోడీ.. 6-3, 7-6 (7/2)తో అలగ్జాండర్ ఎర్లెర్ (ఆస్ట్రేలియా), వవస్సురి (ఇటలీ) ద్వయాన్ని వరుస సెట్లలో చిత్తుచేసింది.
ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించడం బాంబ్రీకి ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్‌లో దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు ప్రిక్వార్టర్స్‌లోనే షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్ జాక్ డ్రాపర్ (బ్రిటన్).. 4-6, 6-4, 7-6 (7/5)తో జొకోను ఓడించి క్వార్టర్స్ చేరుకున్నాడు. టాప్ సీడ్ అల్కరాజ్, మెద్వెదెవ్‌తో పాటు మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రిబాకినా, జెస్సికా పెగులా క్వార్టర్స్ బెర్తులను ఖాయం చేసుకున్నారు.