Money laundering | అమెరికాలో పలు ఆర్థిక నేరాలు.. భారత సంతతి సోదరులకు 400 ఏండ్ల జైలు శిక్ష!
మనీలాండరింగ్, హెచ్1బీ వీసా, పన్ను ఎగవేత సహా వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారన్న కేసులో భారత సంతతికి చెందిన ఇద్దరు సోదరులను అమెరికాలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ‘సవానీ గ్రూప్' పేరుతో పలు రకాల వ్యాపారాలు నడుపుతున్న భాస్కర్ సవానీ(60), అరుణ్ సవానీ(58)లకు దాదాపు 400 ఏండ్లకుపైగా జైలు శిక్ష పడే అవకాశముందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
- అమెరికాలో పలు ఆర్థిక నేరాలు
వాషింగ్టన్, మార్చి 12 : మనీలాండరింగ్, హెచ్1బీ వీసా, పన్ను ఎగవేత సహా వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారన్న కేసులో భారత సంతతికి చెందిన ఇద్దరు సోదరులను అమెరికాలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ‘సవానీ గ్రూప్’ పేరుతో పలు రకాల వ్యాపారాలు నడుపుతున్న భాస్కర్ సవానీ(60), అరుణ్ సవానీ(58)లకు దాదాపు 400 ఏండ్లకుపైగా జైలు శిక్ష పడే అవకాశముందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. వీరితోపాటు దోషిగా తేలిన అలెక్సాంద్రా రాడోమియాక్కు కోర్టు 40 ఏండ్ల జైలు శిక్ష విధించనున్నది! అమెరికాలో కొన్నేండ్లుగా వీరు ‘సవానీ గ్రూప్’ పేరుతో అక్రమ వ్యాపార కార్యకలాపాలను సాగిస్తూ కోట్లాది డాలర్లు కొల్లగొట్టారని ప్రాసిక్యూటర్లు మీడియాకు తెలిపారు.
అమెరికా అటార్నీ కార్యాలయం గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హెచ్1బీ వీసాలకు సంబంధించి మోసపూరిత దరఖాస్తులు, పిటిషన్లు దాఖలు చేసి పెద్ద సంఖ్యలో విదేశీ కార్మికులను అమెరికాకు రప్పించి, అటు తర్వాత వారి వేతనాల నుంచి బలవంతంగా వసూలు చేశారని దర్యాప్తులో తేలింది. ఇందులో అత్యధికులు ఇండియన్స్ ఉన్నారని తెలిపింది. ఇక హెల్త్‌కేర్ పథకంలో అక్రమ బిల్లులు ప్రవేశపెట్టి 30 మిలియన్ డాలర్లు కొల్లగొట్టారని పేర్కొన్నది. వివిధ ప్రభుత్వ పథకాల్లో అక్రమంగా కొల్లగొట్టిన సొమ్మునంతా మనీలాండరింగ్ ద్వారా కార్పొరేట్ బ్యాంక్‌ల్లోకి తరలించారని 2023లో వారిపై ఆరోపణలు నమోదయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

