Sidhu Moosewala | దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్ కౌర్ (Charan Kaur) గతేడాది మార్చిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబు ఫస్ట్ బర్త్‌డే వేడుకలను గాయకుడి కుటుంబం సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్సతోపాటు పంజాబ్ మాజీ సీఎం (Ex Punjab Chief Minister) చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి సిద్ధూకి కేక్ తినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా చరణ్‌జిత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
కాగా, ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో దుండగులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం కావడంతో.. అతడి మృతితో వారు తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలో ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన వారు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా చరణ్ కౌర్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు శుభ్‌దీప్ (సిద్ధూ మూసేవాలా అసలు పేరు) అని పేరు కూడా పెట్టారు. ‘భగవంతుడి ఆశీస్సులతో మేము శుభదీప్ను (Shubhdeep) తిరిగి పొందాము’ అంటూ అప్పట్లో సిద్ధూ తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read..
PM Modi | ట్రూత్ షోషల్లో చేరిన ప్రధాని మోదీ.. ట్రంప్‌తో ఉన్న పవర్ఫుల్ ఫొటోతో తొలి పోస్టు
ED Summons | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు.. లాలూ యాదవ్, రబ్రీ దేవి, తేజ్ ప్రతాప్‌కు ఈడీ సమన్లు
Sonia Gandhi: మన్రేగా వేతనం, పని దినాలు పెంచండి: సోనియా గాంధీ