ప్రభుత్వ బడుల్లో తరగతి గదులుగా ఆ బస్సులు..
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలం చెల్లిన బస్సులను తరగతి గదులుగా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు ధృవీకరించారు.
ఈ సందర్భంగా ఆంటోనీ రాజు మాట్లాడుతూ.. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధిలో కాలం చెల్లిన బస్సులను తుక్కు చేయడం కంటే తరగతి గదులుగా వినియోగిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చిందన్నారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లో ఫ్లోర్ బస్సులన్నింటినీ క్లాస్ రూమ్‌లుగా మార్చడంతో పిల్లలకు కూడా కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. మొదటగా రెండు లో ఫ్లోర్ బస్సులను కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం అన్ని పాఠశాలలకు విస్తరిస్తామని చెప్పారు. మొత్తం 400 బస్సులను తరగతి గదులుగా మార్చనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- class rooms
- Kerala
- KSRTC
- RTC Buses
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

