KS Eshwarappa | మోదీ చెప్పినా వినను..ఇండిపెండెంట్గా బరిలో దిగుతా : కేఎస్ ఈశ్వరప్ప
KS Eshwarappa : కర్నాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. హవేరి-గదగ్ లోక్సభ స్ధానానికి తన కుమారుడికి టికెట్ దక్కడపోవడంతో ఈశ్వరప్ప అసంతృప్తితో ఉన్నారు.
KS Eshwarappa : కర్నాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. హవేరి-గదగ్ లోక్సభ స్ధానానికి తన కుమారుడికి టికెట్ దక్కడపోవడంతో ఈశ్వరప్ప అసంతృప్తితో ఉన్నారు. తాను లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధిస్తానని, ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి తన మనసు మార్చే ప్రయత్నం చేసినా తన నిర్ణయం మార్చుకోనని తేల్చిచెప్పారు. శివమొగ్గలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరప్పను ఓ మహిళ ప్రశ్నించగా ఆయన ఈ మేరకు బదులిచ్చారు.
ప్రధాని మోదీ మీ ఇంటికి వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయవద్దని మీకు నచ్చచెపితే ఏం చేస్తారని మహిళ అడగ్గా బదులిచ్చిన ఈశ్వరప్ప తన మద్దతుదారుల ఆకాంక్షలను తాను గౌరవిస్తానని, తాను ఎన్నికల్లో దీటైన పోటీ ఇచ్చి విజయం సాధిస్తాననే నమ్మకం తనకుందని స్పష్టం చేశారు. తాను 40 ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని సీటీ రవి, సదానంద గౌడ, నళిన్ కుమార్ కటీల్, ప్రతాప్ సింహ వంటి నేతలు కూడా తమనకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.
నిరసన సంకేతంగా యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రపై షిమోగా స్ధానంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని తన మద్దతుదారులు కోరుతున్నారని ఈశ్వరప్ప తెలిపారు. బీజేపీ రెండో జాబితాలో ఈశ్వరప్ప కుమారుడి పేరు లేకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆయనప పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. హవేరి నుంచి కేఈ కంటేష్కు టికెట్ ఇస్తామని యడియూరప్ప హామీ ఇవ్వడంతో అక్కడ ప్రచారం చేసుకోవాలని తన కుమారుడు కంటేష్ను అక్కడికి పంపానని ఈశ్వరప్ప చెప్పారు. కానీ తన కుమారుడు కంటేష్కు టికెట్ దక్కలేదని, అయితే యడియూరప్ప కుమారుడికి మరోసారి టికెట్ లభించిందని అన్నారు.
Read More :
Tirumala | సిఫారసు లేఖల రద్దుతో భక్తులకు ఊరట.. నేరుగా క్యూలైన్ల ద్వారా దర్శనం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

