మిస్ ఇండియా పోటీల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీలకు చెందిన వారు ఒక్కరు కూడా లేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగా ఆయన కొట్టిపారేశారు. చిన్నపిల్లల వ్యవహార శైలి వినోదం పంచవచ్చు..అయితే అది విభజించే ఎత్తుగడలతో వెనుకబడిన వర్గాలను అపహాస్యం చేయడం లేదా అణగదొక్కడం ద్వారా చేయరాదని కిరణ్ రిజిజు హితవు పలికారు.
ఇప్పుడు మిస్ ఇండియా పోటీల్లో, సినిమాలు, క్రీడల్లోనూ రాహుల్ రిజర్వేషన్లను కోరుతున్నారు. ఇది పిల్లల మనస్తత్వం మాత్రమే కాదు, అతడిని (రాహుల్) ప్రోత్సహించే వ్యక్తులు కూడా అంతే బాధ్యత వహిస్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, దేశ వ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మిస్ ఇండియా పోటీల్లో దళితులు, గిరిజినులు, ఓబీసీ వర్గాలకు చెందిన ఒక్క మహిళ కూడా లేరని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశ మీడియా డ్యాన్స్, మ్యూజిక్, క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడుతుందని, కానీ రైతులు, కార్మికుల గురించి పట్టించుకోదని ఆరోపించారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కులగణన కేవలం జనాభా లెక్క కాదని, ఇది సమర్ధవంతమైన విధానాల రూపకల్పనకు పునాది వంటిదని చెప్పారు.
Read More :