Kidneys to sell | మహారాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం.. కిడ్నీలు అమ్ముతామంటూ నాందేడ్ కలెక్టరేట్ వద్ద పోస్టర్
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.
- మహారాష్ట్ర డబుల్ఇంజిన్ సర్కార్ పాలనలో వ్యవసాయం దయనీయం
Kidneys to sell | ముంబై(నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. నాందేడ్ జిల్లాలోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద కిడ్నీలు అమ్ముతామంటూ పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ కిడ్నీలు అమ్మేందుకు సిద్ధపడటమే ఆ రాష్ట్రంలోని రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నది. జిల్లాకు చెందిన ఓ వ్యవసాయ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో ఒకే కుటుంబంలోని తండ్రి, పెద్ద కుమారుడు, రెండో కుమారుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి తీసుకున్న రెండు లక్షల రూపాయల అప్పు తీర్చే దారిలేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కిడ్నీలు అమ్మేందుకు సిద్ధమయ్యారు.
వడ్డీ వ్యాపారుల బెదిరింపులు…
నాందేడ్ జిల్లా సిల్లోడ్ తాలుకా పింపల్గావ్ పేట్కు చెందిన యువ రైతు సోమనాథ్ పండిత్ బోసలే (౩౦) అప్పుల పాలై గురువారం రాత్రి తన పొలంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 15 ఏండ్ల క్రితం సోమనాథ్ తండ్రి పండిత్ మాణిక్ రావు బోసలే, 19 లో సోమనాథ్ పెద్దన్న గజానన్ మాణిక్ రావు బోస లే బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రి, పెద్దన్నల ఆత్మహత్యల తర్వాత కుటుంబ భారం సోమనాథ్పై పడటంతో పాటు అప్పులు కొండలా పెరిగిపోవడంతో సోమనాథ్ పండిత్ బోసలే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కిడ్నీలు అమ్మేందుకు సిద్ధమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

