Poll Campaign | వచ్చే వారం చత్తీస్ఘఢ్ నుంచి ఖర్గే ఎన్నికల ప్రచారం షురూ
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరాం ఎన్నికలకు ప్రచారాన్ని (Poll Campaign) ప్రారంభించేందుకు కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది.
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరాం ఎన్నికలకు ప్రచారాన్ని (Poll Campaign) ప్రారంభించేందుకు కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే వచ్చే వారం చత్తీస్‌గఢ్ నుంచి ప్రచార పర్వానికి తెరలేపేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సంసిద్ధమయ్యారని ఆ పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఆపై త్వరలో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో ప్రచార ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్ట్ 13న రాయ్‌పూర్‌లో జరిగే ర్యాలీతో ప్రచార పర్వానికి ఖర్గే శ్రీకారం చుడతారు. ఇక 18న తెలంగాణలో, 22న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో, 23న రాజస్ధాన్ రాజధాని జైపూర్‌లో జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు.
కాంగ్రెస్ చీఫ్ ఎన్నికల ప్రచారం నేపధ్యంలో ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలతో సంప్రదింపులు చేపడుతున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు ఇప్పటివరకూ 20 రాష్ట్రాల నేతలతో పార్టీ అగ్రనేతలు సమాలోచనలు జరిపారు. ఖర్గేతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా విస్తృతంగా ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read More :
No Confidence Motion | మోదీకి ప్రధానిగా కొనసాగే అర్హత లేదు : సీపీఎం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

