No Confidence Motion | మోదీకి ప్రధానిగా కొనసాగే అర్హత లేదు : సీపీఎం
పార్లమెంట్లో మంగళవారం అవిశ్వాస తీర్మానంపై (No Confidence Motion) చర్చ సందర్భంగా మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడ్డాయి.
న్యూఢిల్లీ : పార్లమెంట్లో మంగళవారం అవిశ్వాస తీర్మానంపై (No Confidence Motion) చర్చ సందర్భంగా మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడ్డాయి. మణిపూర్ అల్లర్లతో భగ్గుమంటే ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చారని మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వాన్నివిస్మరించి ఓ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది కూడా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రంపై సుప్రీంకోర్టు తీవ్ర చర్యలు చేపట్టడం అసాధారణమని, ప్రధాని మోదీకి ఏ మాత్రం సిగ్గున్నా తన పదవికి రాజీనామా చేసి ఉండేవారని సీపీఎం ఎంపీ ఆరిఫ్ పేర్కొన్నారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మణిపూర్ పాలనా యంత్రాంగంపై సుప్రీంకోర్టు పూర్తి నియంత్రణ చేపట్టిన క్రమంలో మోదీని ప్రధానిగా ఎందుకు గుర్తించాలని ఆరిఫ్ ప్రశ్నించారు. ఇక టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. బెంగాల్‌కు కేంద్రం పలుమార్లు ప్రతినిధి బృందాలను పంపిందని, కానీ మణిపూర్‌కు ఒక్క ప్రతినిధి బృందాన్నీ పంపలేదని ఆరోపించారు. భారత్‌ను ప్రేమించేవారెవరైనా మోదీని ద్వేషిస్తారన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మణిపూర్ ఘటనలను మాటమాత్రంగానూ ప్రస్తావించలేదని అన్నారు.
డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితుడని అభివర్ణిస్తూ మణిపూర్ భగ్గుమంటుంటే ప్రధాని మోదీ ఎక్కడున్నారని నిలదీశారు. పార్లమెంట్‌కు రావాలని ప్రజలు మోదీని ఎన్నుకుంటే సభకు వచ్చేందుకు ఆయనకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారితే ఐరోపా, బ్రిటిష్ పార్లమెంట్లు ఆందోళన వ్యక్తం చేసినా మోదీ సర్కార్ మౌనం దాల్చిందని అన్నారు. మణిపూర్ అల్లర్లలో ఏకంగా 163 మంది మరణిస్తే ప్రధాని నోరుమెదపలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న పరిస్ధితి తరహాలోనే మణిపూర్‌లోనూ మెజారిటీ వర్సెస్ మైనారిటీ అన్నట్టుగా పరిస్ధితులు నెలకొన్నాయని డీఎంకే ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Sherlyn Chopra | రాహుల్ గాంధీతో పెళ్లికి ఓకే.. అయితే ఓ షరతు : షెర్లిన్ చోప్రా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

