న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Attack) ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా పాకిస్థాన్ వైఖరిని ఖండిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ .. ప్రధాని మోదీని కోరారు. టెర్రర్ అటాక్‌పై చర్చించేందుకు అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఏకపక్ష తీర్మానం చేద్దామన్నారు.
ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే ఆ దాడిని ఖండిస్తూ.. ప్రస్తుత దశలో ఐకమత్యం, సంఘీభావం కావాలన్నారు. ఇలాంటి సమయంలో ఉభయసభల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షం భావిస్తున్నదని ఖర్గే తెలిపారు. పార్లమెంట్ తీర్మానంతో ఐకమత్యం చాటుదామని పేర్కొన్నారు. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందిన విషయం తెలిసిందే. వీలును బట్టి పార్లమెంట్ సెషన్‌ను నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు ఖర్గే చెప్పారు.
My letter to @PMOIndia, Shri @narendramodi, on convening a special session of both houses of the Parliament at the earliest.
“At this moment, when unity and solidarity is essential, Opposition believes that it is important to convene a special session of both houses of… pic.twitter.com/DPsGhAPJhr
— Mallikarjun Kharge (@kharge) April 29, 2025
రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. పెహల్గామ్ విషాదం ప్రతి భారతీయుడిని కలిచివేసిందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఇండియా తన శక్తిని చాటాలని రాహుల్ తెలిపారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ద్వారా ప్రజలు తమ ఐకమత్యాన్ని, దీక్షను చాటవచ్చు అన్నారు.
My letter to PM Modi requesting a special session of both houses of Parliament to be convened at the earliest.
At this critical time, India must show that we always stand together against terrorism. pic.twitter.com/7AIXGqBqTl
— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2025