Techie | విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవలే తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ టెకీ (Techie) క్యాబిన్ సిబ్బందిని లైంగికంగా వేధించి చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన దుబాయ్ నుంచి హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది.
నవంబర్ 28న ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన విమానం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు (Dubai to Hyderabad Flight) వచ్చింది. ఆ సమయంలో విమానంలోని మహిళా సిబ్బంది పట్ల ఓ టెకీ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Rajiv Gandhi International Airport)లో ల్యాండ్ కాగానే అతడిని పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి కేరళకు చెందిన నజీర్‌గా గుర్తించారు. అతడు సౌదీ అరేబియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేశారు.
Also Read..
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
Lok Sabha | సర్‌పై విపక్షాల ఆందోళన.. లోక్‌సభ వాయిదా
Delhi Blast | ఢిల్లీ పేలుడు కేసు.. జమ్ము కశ్మీర్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు