Lok Sabha | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే దిగువసభ (Lok Sabha) వాయిదా పడింది.
సభ ప్రారంభం కాగానే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయొద్దంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యుల ఆందోళనలపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ‘ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్‌కు పంపింది.. నినాదాలు, ఆందోళనలు చేయడానికి కాదు. ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలి’ అని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ఈ మేరకు సభను 12 గంటలకు వాయిదా వేశారు.
Also Read..
PM Modi | పరాజయాన్ని ఒప్పుకొనే మనసు విపక్షానికి లేదు : ప్రధాని మోదీ
Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
Pinarayi Vijayan | రూ.2వేల కోట్ల మసాలా బాండ్ కేసు.. కేరళ సీఎంకు ఈడీ నోటీసులు