కోల్కతా: కేరళలో తగ్గుముఖం పట్టినట్టు భావిస్తున్న ప్రమాదకర నిపా వైరస్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టిందా అన్న భయాలు ప్రారంభమయ్యాయి. కేరళ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నిపా వైరస్ లక్షణాలతో కోల్కతాలోని ఒక దవాఖానలో చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
బుర్దాన్ జిల్లాకు చెందిన ఆ వ్యక్తి కేరళలో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు అధిక జ్వరం, గొంతు నొప్పి, వికార లక్షణాలతో దవాఖానలో చేరాడు. వైరస్ నిర్ధారణ కాలేదని, అతని శ్యాంపిల్స్ పరీక్షకు పంపామని బెలిఘాట ఐడీ దవాఖాన వైద్యాధికారులు తెలిపారు.