తిరువనంతపురం, అక్టోబర్ 8: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రభావిత ప్రాంతాల్లో రుణ మాఫీ అమలుజేసేందుకు నిరాకరించిన కేంద్రంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ ప్రజలను ఆదుకోవటంలో కేంద్రం విఫలమైందని పేర్కొన్నది. కేంద్రం దాతృత్వం రాష్ర్టానికి అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రభావిత ప్రాంతంలో బాధితులైన వారి నుంచి రుణ వసూళ్లను వెంటనే ఆపివేయాలని జడ్జి జస్టిస్ నంబియార్ బ్యాంకులను ఆదేశించారు. తీవ్రస్థాయి విపత్తులు సంభవించకున్నా అస్సాం, గుజరాత్‌లకు నిధులు మంజూరు చేసిన కేంద్రం, వయనాడ్ బాధితులను ఆదుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో ఆయా బ్యాంకులు ‘ఇంప్లీడ్’ కావాలని పేర్కొంటూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.