Rahul Mamkootathil | కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే (Palakkad MLA) రాహుల్ మమ్కూతతిల్ (Rahul Mamkootathil)పై లైంకిగ వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. యువ రాజకీయ నాయకుడు (youth leader) తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నటి (Malayalam Actor), మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ (Rini Ann George) ఆరోపించింది. అంతేకాదు పలువురు మహిళలు కూడా ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలే చేశారు. దీంతో కేరళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది.
మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల (Mollywood) ఆరోపణలు మరోసారి కలకలం రేపాయి. ఓ యువ రాజకీయ నాయకుడు (youth leader) తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నటి (Malayalam Actor), మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ (Rini Ann George) ఆరోపించిన విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో రిని ఆన్ జార్జ్ మాట్లాడుతూ.. ఓ యువ రాజకీయ నాయకుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ రిని ఆన్ జార్జ్ ఆరోపించింది. ఫైవ్‌స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేశాను రమ్మంటూ అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే, ఆ యువ నాయకుడు ఎవరన్నది మాత్రం చెప్పలేదు. పేరు, పార్టీ వంటి వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించింది. బీజేపీ మాత్రం ఆ యువ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ మమ్కూతతిల్ (Rahul Mamkootathil)గా తెలిపింది. ఆ తర్వాత రచయిత్రి హనీ భాస్కరన్ (Honey Bhaskaran) కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అందులో మమ్కూతతిల్ పేరును ప్రస్తావించారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, పదేపదే అభ్యంతరకర మెసేజ్‌లు పంపారంటూ ఆరోపించారు. యూత్ కాంగ్రెస్‌లో ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయిని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హనీ భాస్కరన్ ఆరోపించారు. ఆ తర్వాత ఓ ట్రాన్స్ ఉమెన్ కూడా రాహుల్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. ఇక ఈ ఆరోపణలతో రాహుల్ కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి ఇప్పటికే రాజీనామా కూడా చేశారు.
Also Read..
Rekha Gupta | సీఎంను కత్తితో పొడవాలని ప్లాన్ చేసి.. దాడి ఘటనలో కీలక విషయం వెలుగులోకి
Heavy Rains | భారీ వరదలతో ఉప్పొంగిన సుర్వాల్ డ్యామ్.. గ్రామంలో 2 కిలోమీటర్ల గుంత