Rekha Gupta | ఢిల్లీ సీఎం (Delhi CM) రేఖాగుప్తా (Rekha Gupta)పై గతవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. తన అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతుండగా సీఎం దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌భాయ్ సకారియా (Sakriya Rajeshbhai Khimji)ని అరెస్ట్ చేశారు. అయితే విచారణ సందర్భంగా తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంపై కత్తి (knife)తో దాడి చేసేందుకు తొలుత నిందితుడు ప్లాన్ చేసినట్లుగా తెలిసింది.
సీఎంని కత్తితో పొడవాలని నిందితుడు ప్లాన్ చేసుకున్నాడని.. అయితే, భారీ భద్రత కారణంగా తన ప్రణాళికను విరమించుకున్నట్లు సమాచారం. టైట్ సెక్యూరిటీ ఉండటంతో కత్తిని బయటే పడేసి లోపలికి ప్రవేశించినట్లు తెలిసింది. వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ తాను ఇచ్చిన వినతులను పట్టించుకోనందునే దాడి చేసినట్లు విచారణ సమయంలో నిందితుడు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా (Rekha Gupta)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సీఎం తలకు స్వల్ప గాయమైంది. అక్కడ ఉన్నవారు అతడిని బంధించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసు నమోదుచేశారు. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌భాయ్ సకారియా(42)గా గుర్తించారు. ఈ ఘటన ఇటీవలే తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
Also Read..
Heavy Rains | భారీ వరదలతో ఉప్పొంగిన సుర్వాల్ డ్యామ్.. గ్రామంలో 2 కిలోమీటర్ల గుంత
Road Accident | భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కంటైనర్.. 8 మంది మృతి
CIBIL Score | తొలిసారి రుణం కోరేవాళ్లకు సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు.. స్పష్టం చేసిన కేంద్రం