జైపూర్: రాజస్థాన్లో భారీ వర్షాలు (Heavy Rains)దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సువాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోయింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో గ్రామంలో 2 కిలోమీటర్ల మేర జలపాతం మాదిరిగా పెద్ద గుంత ఏర్పడింది. 2 కిలోమీటర్ల పొడవున్న గుంత 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతు ఉన్నది. వరద ఉధృతికి రెండు ఇండ్లు, రెండు షాపులు, రెండు దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కాగా, వర్షాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు.
గ్రామానికి చేరుకున్న ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సమీపంలోని ఇండ్లను ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కరోడి లాల్ మీనా గుంతపై ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. యంత్రాల సహాయంతో నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుత పరిస్థితిల్లో భూమి కోతను ఆపడం కష్టమని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజస్థాన్లోని వందలాది గ్రామాలు నిట మునిగాయి. కోటా, బుండీ, సవాయ్ మాధోపూర్, ఝాలావార్ జిల్లాలో భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉన్నది. కోటా జిల్లాలోని నిమోడా గ్రామంలో 400కి పైగా ఇండ్ల నేలకూలాయి. వంది మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆర్మీతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీ ఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.
सवाई माधोपुर, राजस्थान के जाडावता गांव में भारी बारिश से स्थिति बेहद गंभीर हो गई है। यहाँ मानो ‘नियाग्रा फॉल्स’ फूट पड़ा है, जहाँ कभी अमरूद के बाग और हरे-भरे खेत हुआ करते थे, वहाँ अब पानी के तेज बहाव ने उन्हें एक गहरी नदी में बदल दिया है। पानी के लगातार कटाव से जमीन चौड़ी ..1/2 pic.twitter.com/poyX33CkPq
— Lokesh kumar (@lkmeena8619) August 24, 2025
Rajasthan: Visuals from the site in Sawai Madhopur where a big portion of land caved in following heavy rainfall in the region
(Source: ANI) pic.twitter.com/1PHjxAIEPh
— WION (@WIONews) August 24, 2025