Road Accident | భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కంటైనర్.. 8 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్‌షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కంటైనర్ అదుపుతప్పి గోగాజీ భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్‌షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కంటైనర్ అదుపుతప్పి గోగాజీ భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో 8 మంది మృతిచెందారు. మరో 43 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బాధితులు యూపీలోని కాస్గంజ్ నుంచి రాజస్థాన్‌లోని గోగామేడికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 43 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను ఘటనా స్థలం నుంచి తొలగించామన్నారు. ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
#WATCH | Uttar Pradesh | Visuals from the spot where 8 people died and 43 got injured after a container hit a tractor full of devotees of Gogaji, going to Gogamedi, Rajasthan, from Kasganj, near Ghatal village on National Highway 34 under Bulandshahr police station. pic.twitter.com/yjpqNnOhhJ
— ANI (@ANI) August 25, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

