Russian Oil | రష్యా చమురు (Russian Oil) కొనుగోలును కారణంగా చూపి భారత్ (India)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అదనపు టారిఫ్‌లు (US tariffs) విధించిన విషయం తెలిసిందే. అమెరికా తీరుపై రష్యాలోని భారత రాయబారి తాజాగా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
యూఎస్ టారిఫ్ ఆంక్షలపై మాస్కోలోని భారత రాయబారి (New Delhi’s envoy to Moscow) వినయ్ కుమార్ (Vinay Kumar) మాట్లాడుతూ.. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని కుండబద్దలు కొట్టారు. ‘టారిఫ్‌ల విషయంలో అమెరికా నిర్ణయం అన్యామైనది, అసమంజసం. ఇది ఫెయిర్ ట్రేడ్ రూల్స్‌ను అణచివేయడమే. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే మా మొదటి ప్రాధాన్యం. దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్లో బెస్ట్ డీల్‌తో ఎక్కడ చవకగా దొరికితే అక్కడ నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. రష్యాతో భారత సహకారం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి’ అని భారత రాయబారి స్పష్టం చేశారు.
Also Read..
Diabetes | ఇకపై శ్వాస ద్వారా మధుమేహం నిర్ధారణ!.. పరీక్ష ఖర్చు తక్కువ, సమయం ఆదా!
మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మ్యాక్రోహార్డ్ ప్రారంభించిన మస్క్
ట్రంప్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవాలి