వాషింగ్టన్, ఆగస్టు 24: రష్యా చమురు కొనుగోలు చేస్తున్నదంటూ భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం వరకు టారిఫ్లు విధించటం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నది. దీనిపై రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ తాజాగా ‘ఎక్స్’లో కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని భారత్ సీరియస్గా తీసుకోవాలని ఆమె ‘న్యూస్వీక్’లో అభిప్రాయపడ్డారు.
‘పరిష్కారం కోసం న్యూఢిల్లీలోని నాయకత్వం వీలైనంత తొందరగా వైట్హౌజ్తో చర్చలు జరపాలి’ అని అన్నారు. చైనా, భారత్ ఒకటి కాద ని, భారత్ ప్రజాస్వామ్యభాగస్వా మి.. అంటూ ఆ వ్యాసంలోని ఆమె వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పు డు ఇదే వ్యాసంలోని మరికొంత భాగాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.