వాషింగ్టన్ : టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త ఏఐ స్టార్టప్ కంపెనీ మ్యాక్రోహార్డ్ను ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్‌కు పోటీగా ప్రారంభించిన ఈ కంపెనీకి మ్యాక్రోహార్డ్ అని పేరు పెట్టారు. మస్క్ శుక్రవారం ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, ఈ పేరు చిలిపిగా ఉండవచ్చు కానీ, ఈ ప్రాజెక్టు వాస్తవమైనదని చెప్పారు. సూత్రప్రాయంగా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భౌతిక హార్డ్‌వేర్‌ను తయారు చేయవని, వాటిని కృత్రిమ మేధతో పూర్తిగా సిమ్యులేట్ చేయడం సాధ్యం కావాలని చెప్పారు.
మీడియా కథనాల ప్రకారం, మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ ఈ నెల 1న మ్యాక్రోహార్డ్ పేటెంట్ కోసం దరఖాస్తును యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌కు సమర్పించింది. ఏఐ ఫోకస్డ్ సర్వీసులను ఈ కంపెనీ ద్వారా అందజేయనున్నట్లు తెలిపింది.