బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 16:25:30

కాంగ్రెస్‌ నేత నిరాహార దీక్ష

కాంగ్రెస్‌ నేత నిరాహార దీక్ష

తిరువనంతపురం: కేరకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు రమేశ్‌ చెన్నితల శుక్రవారం ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస కేరళీయులను రాష్ట్రానికి తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీనిని నిరసిస్తూ ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టినట్లు రమేశ్‌ తెలిపారు. కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ఉదయం 9 గంటలకు ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు. కేరళ మాజీ సీఎం ఉమెన్‌ చాందీతోపాటు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ నేతలు మాస్కులు ధరించి ఇందులో పాల్గొన్నారు. logo