Lok Sabha Elections | న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: లోక్‌సభ రెండో విడత ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడింది. 13 రాష్ర్టాలు, యూటీల్లోని 89 లోక్‌సభ స్థానాలకు 26న శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. తొలి విడతలో 21 రాష్ర్టాల్లోని 102 స్థానాలకు 19న ఎన్నికలు జరిగాయి.
రెండో విడతలో రాహుల్‌గాంధీ (వయనాడ్), హేమామాలిని (మథుర), రాజీవ్ చంద్రశేఖర్ (తిరువనంతపురం), శశిథరూర్ (తిరువనంతపురం), ఓం బిర్లా (కోటా), అరుణ్ గోవిల్ (మీరట్), కుమారస్వామి (మండ్య) వంటి ప్రముఖులు ఉన్నారు. మూడో దశ ఎన్నికల మే 7న జరుగనున్నాయి.