తిరువనంతపురం: ఎర్నాకుళం-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఆరెస్సెస్ గీతం పాడించడం పట్ల దక్షిణ రైల్వేపై శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా మండిపడ్డారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ అలాంటి చోట పాటించాల్సిన మత, రాజకీయ తటస్థతకు తిలోదకాలివ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది గర్హనీయమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.