Kedarnath Temple | ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. శీతాకాలం నేపథ్యంలో భాయ్ దూజ్ పండగ రోజున శాస్త్రోక్తంగా ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయాన్ని మూసివేయనున్న నేపథ్యంలో పూలతో అందంగా అలంకరించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సైతం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం వేకువ జామున 4 గంటలకు ఆలయ తలుపులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ద్వారాలను మూసివేసి.. పంచముఖి డోలి యాత్ర ఉఖీ మఠ్‌కు బయలుదేరింది.
ఆరు నెలల పాటు బాబా కేదార్ ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారేశ్వరుడు పూజలందుకోనున్నాడు. కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత అనంతరం స్వామివారిన పంచముఖి ఉత్సవ డోలి యాత్రగా తరలించారు. ఈ డోలి యాత్ర సందర్భంగా వేలాది మంది భక్తులు ఇండియన్ ఆర్మీ బ్యాండ్‌తో కలిసి నృత్యాలు చేశారు. ఈ ఏడాది కేదార్నాథ్ యాత్ర సందర్భంగా 17.39లక్షల మంది భక్తులు బాబా కేదార్‌ను దర్శించుకున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం సాయంత్రం దాదాపు ఐదువేల భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటికే కేదార్‌నాథ్‌లో భారీగా చలి పెరిగింది. బుధవారం మధ్యాహ్నం మంచు కురిసింది.
#WATCH | Uttarakhand: The portals of Kedarnath Temple close for the winter on the occasion of Bhai Dooj. The portals were closed with Vedic rituals and religious traditions amidst chants of Om Namah Shivay, Jai Baba Kedar and devotional tunes of the Indian Army band. pic.twitter.com/CVrXGI7NcM
— ANI (@ANI) October 23, 2025