Ayodhya Incident : అయోధ్యలో బాలికపై లైంగిక దాడి కేసుకు సంబంధించి ఎస్పీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారని దీనిపై ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏం సమాధానం చెబుతారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ ఎవరినీ కాపాడేందుకు అఖిలేష్ ప్రయత్నం చేయరాదని అన్నారు.
ఈ ఘటనపై బీజేపీ నేత షెజాద్ పూనావాలా స్పందించారు. నిత్యం ఓబీసీ, దళిత్, మైనారిటీలు (పీడీఏ) అంటూ మాట్లాడే అఖిలేష్ యాదవ్ ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికపై వేధింపులు జరిగితే మౌనం దాల్చారని మండిపడ్డారు. డీఎన్ఏ టెస్ట్‌కు అఖిలేష్ డిమాండ్ చేయడం నిందితుడికి క్లీన్చిట్ ఇచ్చే ప్రయత్నంలో భాగం కాదా అని నిలదీశారు.
ఎస్పీ కార్యకర్తలు ఈ నేరానికి పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై డింపుల్ యాదవ్ కూడా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం పీడీఏ గురించి మాట్లాడే ఎస్పీ నేతల నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని చెప్పారు. ఈ ఘటనపై దోషులను యోగి సర్కార్ విడిచిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
Read More :
Man shot dead | చండీగఢ్ కోర్టులో హత్య ఘటన.. కుటుంబ తగాదాలే కారణం..!