Man shot dead : చండీగఢ్ కోర్టు (Chandigarh court) లో ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ICAS) అధికారి హర్‌ప్రీత్ సింగ్ (Harpreet Sing) హత్యకు గురైన సంగతి తెలసిందే. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నది. కుటుంబ తగాదాలే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. శనివారం అదే విషయమై ఇద్దరి మధ్య కోర్టు ఆవరణలో రాజీ ప్రయత్నాలు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హతుడు హర్‌ప్రీత్ సింగ్ (37) ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ అధికారి. ఆయనకు, మాజీ పోలీస్ అధికారి అయిన ఆయన మామ మాల్విందర్ సింగ్ సంధూ సొంత మామా అల్లుళ్లు. కుటుంబ తగాదా నేపథ్యంలో రెండు కుటుంబాలు చండీగఢ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాయి. దాంతో శనివారం రెండు కుటుంబాల వారిని కూర్చోబెట్టి మధ్యవర్తులు రాజీకి ప్రయత్నాలు చేశారు.
ఈ క్రమంలోనే మామ తనకు మూత్రం వస్తున్నదని చెప్పి, టాయిలెట్ చూపించేందుకు అల్లుడి రమ్మన్నాడు. దాంతో అల్లుడి వెంట వెళ్లగా తనకు దగ్గురున్న పిస్తోల్‌తో ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అందులో రెండు బుల్లెట్లు హర్‌ప్రీత్‌కు తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమయానికి కోర్టులోని అంబులెన్స్ పనిచేయకపోవడంతో అరగంట కాలయాపన తర్వాత ఓ అడ్వకేట్ కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.