Kashmir Times | జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ మీడియా సంస్థ కార్యాలయంలో క్యాట్రిడ్జ్‌లు లభించడం కలకలం రేపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో జమ్ము కశ్మీర్ పోలీసులకు చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ గురువారం జమ్ము కశ్మీర్‌లోని కశ్మీర్ టైమ్స్ (Kashmir Times) కార్యాలయంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏకే-47 బుల్లెట్లు (AK 47 Cartridges) లభించాయి.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం నుంచి చేపట్టిన సోదాల్లో ఏకే-47 బుల్లెట్లు, పిస్టల్ రౌండ్స్ (pistol rounds), మూడు గ్రనేడ్ లెవర్స్ (three grenade levers)ను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశం, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. అంతేకాదు కశ్మీర్ టైమ్స్పై ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. ఇందులో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ పేరును కూడా చేర్చారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కశ్మీర్ టైమ్స్.. జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ. దీన్ని వేద్ భాసిన్ స్థాపించారు. 1954లో వీక్లీగా ప్రచురణ ప్రారంభించిన ఈ పత్రిక.. ఆ తర్వాత డైలీగా మారింది.
Also Read..
Robert Vadra | మనీలాండరింగ్ కేసు.. రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు
Delhi Blast | హిజాబ్ ఎందుకు ధరించడం లేదు..? : రోగులను ప్రశ్నించిన డాక్టర్ ఉమర్ నబీ
Prashant Kishor | బీహార్ ఎన్నికల్లో ఓటమి.. మౌనదీక్ష చేపట్టిన ప్రశాంత్ కిషోర్