Prashant Kishor | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar election results) జన్‌సురాజ్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ‘జన్ సురాజ్ (Jan Suraaj)’ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే ఘోరంగా ఓడిపోయింది. ఈ ఫలితాలతో పీకే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజంతా మౌన వ్రతం పాటిస్తున్నారు. బీహార్‌లోని భితిహర్వా గాంధీ ఆశ్రమం (Bhitiharwa Gandhi Ashram)లో ఈ రోజు మొత్తం మౌన దీక్షలో ఉండనున్నారు. మరోవైపు నేడు బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Jan Suraaj founder Prashant Kishor holds a silent introspection of Bihar election results, at Bhitiharwa Gandhi Ashram in Bihar pic.twitter.com/gljKnWgxYc
— ANI (@ANI) November 20, 2025
ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిజాయితీగా తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, పార్టీ ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. తప్పులను సరిచేసుకుని మరింత బలంగా ముందుకు వస్తామని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. తమవైపు నుంచి చాలా పాజిటివ్‌గా పనిచేశామని, కానీ ఎక్కడో పొరపాటు జరిగిందని అన్నారు. ప్రభుత్వాన్ని మార్చడంలో తాము విఫలమయ్యామని, ప్రజలను అర్ధం చేసుకోవడంలో కూడా విఫలమైనందుకు తానే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారు. ఆత్మపరిశీలన చేసుకుంటానని, తాను ఒకరోజు మౌనవ్రతం పాటిస్తున్నానని అన్నారు.
Also Read..
Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం
Leopard | మంత్రి నివాసంలోకి చొరబడ్డ చిరుత.. అధికారులు అలర్ట్
Anil Ambani: అనిల్ అంబానీ కేసులో తాజాగా 1400 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ