సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 18:18:32

కర్ణాటక మహిళ, ఇద్దరు పిల్లలు ఐర్లాండ్‌లో మృతి

కర్ణాటక మహిళ, ఇద్దరు పిల్లలు ఐర్లాండ్‌లో మృతి

బెంగళూరు: కర్ణాటకకు చెందిన మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు ఐర్లాండ్‌ దేశంలో మరణించారు. వారి మృతిపై ఆ దేశ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైసూరులోని పెరియపట్న తాలూకా హడగనహళ్లికి చెందిన 37 ఏండ్ల సీమా బాను భర్త సయ్యద్ సమీర్ ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. దీంతో ఆ కుటుంబం ఏడు నెలల కిందట ఆ దేశానికి వెళ్లింది. దక్షిణ డబ్లిన్‌లోని బల్లింటీర్‌లో నివాసం ఉంటున్నది. అయితే అక్టోబర్‌ 28న సీమా బాను, ఆమె ఇద్దరు పిల్లలు అస్ఫిరా (11), ఫైజాన్ సయ్యద్ (7) అనుమానస్పదంగా మరణించడాన్ని గుర్తించారు. స్థానిక పోలీసులు ఈ సమాచారాన్ని కర్ణాటకలోని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు భారత్‌కు చెందిన ముగ్గురి మరణంపై ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబ సభ్యులకు, స్థానిక పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.