Home
National
Karnataka Where The Congress Party Is In Power The Condition Of The Farmers Is Miserable
కర్ణాటక రైతుల మృత్యుఘోష
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. తీవ్ర కరువు, అప్పుల బాధతో వందలాది మంది అన్నదాతలు నిలువునా ఉసురు తీసుకొంటున్నారు.
- 10 నెలల్లో 692 మంది బలవన్మరణం
- ప్రమాదవశాత్తూ మరో 548 మంది మృతి
- కాంగ్రెస్ పాలనలో దయనీయ పరిస్థితులు
బెంగళూరు, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. తీవ్ర కరువు, అప్పుల బాధతో వందలాది మంది అన్నదాతలు నిలువునా ఉసురు తీసుకొంటున్నారు. 2023, ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 10 నెలల కాలంలో 692 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకొన్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి.
హవేరి, బెళగావి, చిక్కమగళూరు జిల్లాల్లో బలవన్మరణాల రేటు అధికంగా ఉన్నది. ఇదే సమయంలో అదే గత 10 నెలల్లో 548 మంది రైతులు పాముకాటు, ఇతర ప్రమాదాల కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 10 నెలల వ్యవధిలో 1,240 మం ది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకొన్న ఇతర లక్షలాది మంది రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నదని, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని పేర్కొన్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

