బెంగళూరు: జీఎస్టీ కేసు మాఫీ కోసం వాణిజ్య పన్నుల ఉన్నతాధికారి పది లక్షలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ లంచం డబ్బు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. (Top Karnataka GST Officer Busted) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) డిప్యూటీ కమిషనర్‌గా 48 ఏళ్ల భరత్ కుమార్ హెగ్డే పని చేస్తున్నాడు. రూ.60 లక్షల జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపిస్తూ 53 ఏళ్ల విశ్వజీత్ నాయక్‌కు నోటీస్ జారీ చేశాడు.
కాగా, జీఎస్టీ అధికారి భరత్ కుమార్ హెగ్డేను విశ్వజీత్ నాయక్ కలిశాడు. తనకు జారీ చేసిన నోటీస్ గురించి అడగ్గా పది లక్షల లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని విశ్వజీత్ నాయక్ లోకాయుక్తను ఆశ్రయించాడు.
మరోవైపు బెంగళూరు లోకాయుక్త ఎస్పీ శివ్ ప్రకాష్ దేవరాజ్ నేతృత్వంలోని అధికారులు ట్రాప్ వేశారు. రూ. 6 లక్షలు లంచం తీసుకుంటున్న జీఎస్టీ అధికారి భరత్ కుమార్ హెగ్డేను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: రాత్రివేళ ఇంటి గోడలు దూకి.. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న వ్యక్తి
Man Dupes High Court Judge | హైకోర్టు న్యాయమూర్తిని ఆరు లక్షలకు మోసగించిన వ్యక్తి.. అరెస్ట్