బెంగళూరు : కర్ణాటకలో కుల గణనను తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పదేండ్ల కిందట నిర్వహించిన కులగణనపై పలు కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
దీనిని 60-80 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం సిద్ధరామయ్యకు సూచించినట్టు తెలిపారు.