సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 22:55:41

కర్ణాటకలో కరోనా విజృంభణ

కర్ణాటకలో కరోనా విజృంభణ

బెంగళూరు : కర్ణాటకలో కరోనా రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పాజిటివ్‌ కేసులు నిత్యం భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  గడిచిన 24 గంటల్లో  ఆ రాష్ట్రంలో కొత్తగా 5,532 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మహమ్మారి బారినపడి 84 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. కర్ణాటకలో ఇప్పటివరకు 1,34,819 పాజిటివ్ కేసులు నమోదు కాగా 74,590 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 57,725 మంది వైరస్‌ బారినుంచి కోలుకొని డిశ్చార్జి కాగా 2,496 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 54,736 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా 853 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 17,50,724 కరోనా కేసులు నమోదు కాగా 5,67,730 దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, 11,45,630 మంది కోలుకోగా 37,364 మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ పేర్కొంది.


logo