Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కర్నాటక మంత్రి, కాంగ్రెస్ నేత కేఎన్ రాజన్న తోసిపుచ్చారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని, మోదీ పోల్స్ అని అవి పూర్తిగా అబద్ధాలని ఆయన తేల్చేశారు. కర్నాటకలో తాము రెండంకెల సీట్లు సాధిస్తామని, 15కిపైగా స్ధానాల్లో విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
కర్నాటకలో మొత్తం 28 లోక్‌సభ స్ధానాలకు గాను బీజేపీ-జేడీఎస్ కూటమి 23 స్ధానాల్లో గెలుపొందుతుందని, కాంగ్రెస్‌కు కేవలం ఐదు స్ధానాలే దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్‌ను విశ్వసించలేమని ఇవి కాషాయ పార్టీకి అనుకూలంగా వండివార్చినవని కర్నాటక మంత్రి రాజన్న ఆరోపించారు.
కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 361 నుంచి 401 స్ధానాలు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, ఇండియా కూటమికి 131 నుంచి 166 స్ధానాలు లభిస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు ఏకంగా 359 స్ధానాలు లభిస్తాయని ఇండియా కూటమికి 154 ఇతరులకు 30 స్ధానాలు దక్కుతాయని అంచనా వేసింది. మరోవైపు న్యూస్ఎక్స్ డైనమిక్స్ ఎన్డీయేకు 371 స్ధానాలు, విపక్ష ఇండియా కూటమికి 125 స్ధానాలు ఇతరులకు 47 స్ధానాలు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసింది.
Read More :
Sri Lanka | భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న ద్వీపదేశం.. 15 మంది మృతి