Traffic | కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ సమస్య మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సాధారణంగానే నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. బుధవారం క్రిస్మస్ సందర్భంగా ప్రజలంతా బయటకు రావడంతో ట్రాఫిక్ రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా మాల్స్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాదారులు చివరకు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపేసి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ గమ్యస్థానాలకు చేరాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.