SM Krishna | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) కన్నుమూశారు. గతకొంత కాలంగా వృద్ధాప్యం రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది (3 Days Of Mourning). డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 12 వరకూ ఎలాంటి కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించడం లేదని తెలిపింది. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం బెళగావిలో నిర్వహిస్తున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు ఎస్ఎం కృష్ణ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
Also Read..
Parliament Winter Session | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. వెంటనే ఉభయసభలు వాయిదా
Manchu Manoj | అందుకే పోరాటం చేస్తున్నా.. మోహన్ బాబు ఫ్యామిలీ హైడ్రామాపై మంచు మనోజ్