తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వీఐపీ దర్శనం(Sabarimala VIP Darshan)పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన శబరిమల సన్నిధానంకు నటుడు దిలీప్ వెళ్లారు. అయితే ఆ సమయంలో ఆయనకు ప్రత్యేక దర్శన వసతులు కల్పించారు. దీని వల్ల సాధారణ భక్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ కేసులో హైకోర్టుకు స్పెషల్ ఆఫీసర్ వివరణ అందజేశారు. సన్నిధానం స్పెషల్ ఆఫీసర్ బిజోయ్ ఓ రిపోర్టును కేరళ హైకోర్టు సమర్పించారు.
నటుడు దిలీప్ దర్శనం ఏర్పాట్లను దేవస్థానం బోర్డు చూసుకున్నట్లు ఆయన చెప్పారు. పోలీసులు ఆ ఏర్పాటు చేయలేదన్నారు. అయితే భక్తులకు దర్శనం సులభంగా కల్పించే రీతిలో తాము పనిచేస్తుంటామని సన్నిధానం వద్ద ఉన్న సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన పట్ల దేవస్థానం విజిలెన్స్ ఇప్పటికే ఓ రిపోర్టును అందజేసింది. సన్నిధానం స్పెషల్ ఆఫీసర్ కూడా ఆ విషయాన్ని తన స్టేట్మెంట్లో తెలిపారు.
నటుదు దిలీప్ దర్శనం చేసుకున్న సమయంలో జరిగిన లోపాలపై ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డును కేరళ హైకోర్టు తప్పుపట్టింది. నటుడికి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్లే సాధారణ భక్తులు సరైన రీతిలో దర్శనం చేసుకోలేకపోయినట్లు కోర్టు పేర్కొన్నది. హరివాసనం పూర్తి అయ్యే వరకు నటుడు దిలీప్ సోపానం వద్ద ఉండిపోయాడరని బెంచ్ తెలిపింది. వీఐపీ దర్శనం కోసం సాధారణ భక్తుల దర్శనం నిలిపివేయడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వివరణాత్మక రిపోర్టును ఇవ్వాలని కోర్టు కోరింది.
Kerala High Court slams Devaswom Board for allowing VIP darshan to actor Dileep at Sabarimala. The Court criticised the VIP darshan facilitated for actor Dileep which caused obstruction for other pilgrims and demanded detailed reports and CCTV footage pic.twitter.com/P1b0Ku8nGQ
— Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) December 6, 2024