బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ జయంతిన జాతీయ జెండాను ఘోరంగా అవమానించారు. కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓ చేతిలో జాతీయ జెండాను పట్టుకుని, మరో చేత్తో సీఎం సిద్ధరామయ్య బూట్లు విప్పడం వివాదాస్పదంగా మారింది.
బుధవారం బెంగళూరులో గాంధీ విగ్రహానికి సిద్ధరామయ్య నివాళి అర్పిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.