Kamal Nath : కాషాయ పార్టీలో కమల్ నాథ్ చేరతారనే ప్రచారానికి తెరపడింది. రాహుల్ గాంధీ తమ నాయకుడని, ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ పిలుపు ఇచ్చారు. రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్యప్రదేశ్‌లో ఎంట్రీకి కాంగ్రెస్ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఉద్వేగంతో స్వాగతించేందుకు వేచిచూస్తున్నారని కమల్ నాథ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
రాహుల్ దేశమంతా తిరుగుతూ అసమానతలు, అన్యాయం, వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని రాసుకొచ్చారు. మధ్యప్రదేశ్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రంలో సాగే రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొని మద్దతు తెలపాలని కోరుతున్నానని పేర్కొన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి మనమంతా బాసటగా నిలవాలని ఆయన పిలుపు ఇచ్చారు.
కాగా కమల్ నాథ్ బీజేపీలో చేరతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఇక కమల్ నాథ్ తన కుమారుడు నకుల్ నాథ్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరతారనే ఊహాగానాల నడుమ రాహుల్ యాత్రపై సీనియర్ నేత చేసిన ట్వీట్లు ఆయన పార్టీ మారతారనే ప్రచారానికి తెరదించాయి.
Read More :
Hyderabad | పెండ్లికి నో చెప్పాడని యాంకర్‌ను కిడ్నాప్ చేసిన యువతి.. పది రోజులుగా రూంలోనే బంధించి..