DY Chandrachud | భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice Of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud)కు నేడు లాస్ట్ వర్కింగ్ డే. ఆయన ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవులు. దీంతో ఆయనకు ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే కావడంతో సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తిగా చివరి సందేశం ఇచ్చారు. వృత్తి పరంగా తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. ‘రేపటి నుంచి సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవం.. అయినప్పటికీ నేను వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను’ అని తెలిపారు. కాగా, సీజేఐ చంద్రచూడ్ 2022 నవంబర్ 8 నుంచి ఈ పదవిలో ఉన్న విషయం తెలిసిందే.
సీజేఐగా చివరి తీర్పు..
కాగా, జస్టిస్ డీవై చంద్రచూడ్ తన లాస్ట్ వర్కింగ్‌డే రోజు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ(Aligarh Muslim University)కి మైనార్టీ హోదా విషయంలో కీలక తీర్పు వెలవరించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నాలుగు రకాల తీర్పులను వెలువరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని ఏడుగురు ధర్మాసనం ఈ తీర్పుల గురించి తెలిపింది. ఏఎంయూ కేసులో నాలుగు రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయని, దీంట్లో మూడు రకాల వ్యతిరేక తీర్పులు ఉన్నట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. మెజారిటీ తీర్పు తనతో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా రాసినట్లు సీజే వెల్లడించారు. జస్టిస్ సూర్యకాంత్, దీపాంకర్ దత్త, సతీశ్ చంద్ర శర్మలు సపరేట్ తీర్పులను ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్లో చట్టం చేసినా.. ఆ విద్యాసంస్థకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేయరని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. పార్లమెంట్ చట్టంతో అలీఘడ్ ముస్లిం వర్సిటీ మైనార్టీ హోదా రద్దు అయినట్లు 1968లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపారేస్తున్నట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. అడ్మినిస్ట్రేషన్‌లో మైనార్టీ సభ్యులు లేనంత మాత్రాన.. ఆ వర్సిటీ మైనార్టీ హోదా పోదు అని సుప్రీంకోర్టు చెప్పింది.
భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
మరోవైపు భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. సంజీవ్ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.
పలు కీలక తీర్పుల్లో భాగస్వామి
న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించిన సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల వినియోగాన్ని ఆయన సమర్థిస్తూ.. అవి పూర్తి భద్రమైనవని, దాని వల్ల బోగస్ ఓట్లు, బూత్‌ల రిగ్గింగ్‌ను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఎలక్టోరల్ బాండ్లపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఖన్నా కూడా ఉన్నారు. 370 అధికరణ రద్దును సమర్థిస్తూ తీర్చు ఇచ్చిన ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడే.
Also Read..
Elon Musk | అమెరికాలో నాకు ఎలాంటి భవిష్యత్తూ కనిపించట్లేదు.. ట్రంప్ గెలుపుపై మస్క్ కుమార్తె ఆందోళన
Mohanlal | అందులో ఆఫీస్ బాయ్‌గా కూడా పనిచేయను.. మోహన్‌లాల్ కీలక వ్యాఖ్యలు
Virat Kohli | ముంబై రెస్టారెంట్లో కోహ్లీ – అనుష్క సందడి.. ఫొటోలు వైరల్