Mahua Maji | ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లో చోటు చేసుకుంది.
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీకి చెందిన ఎంపీ మహువా మాజి (Mahua Maji) తన కుటుంబసభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. అక్కడ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వీరి కారు ప్రమాదానికి గురైంది. జార్ఖండ్‌లోని లతేహార్ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీకి, ఆమె కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాంచీ (Ranchi)లోని రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎంపీ చేతికి పలు ఫ్రాక్చర్లు అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
Also Read..
Arvind Kejriwal: రాజ్యసభకు అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ ఇదేనా!
Actor Vijay | టీవీకే పార్టీ ఆవిర్భావ వేడుకలు.. ఒకే వేదికపై విజయ్, ప్రశాంత్ కిషోర్
Air India | అదో చెత్త ఎయిర్‌లైన్స్.. ఎయిర్ ఇండియాకు ఆస్కార్ ఇవ్వాలి : బీజేపీ నేత